భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వరించింది..??

2021 ఏడాదికి గానూ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. వాతావరణం గురించి అత్యంత ముఖ్యమైన సమాచారం తెలుసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు స్యూకోరో మనాబే (90), క్లాస్‌ హాసెల్‌మాన్‌ (89), జియోర్గియో పరిసీ (73) ముగ్గురు శాస్త్రవేత్తలకు అవార్డు లభించింది.

          మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గురించి స్యూకోరో మనాబో, హాసెల్ మాన్ లు పునాదులు వేేయగా, పరిసీ సంక్లిష్ట వ్యవస్థలో ఒక విధానాన్ని కనుగొనడానికి తోడ్పడ్డాడు.