తజకిస్తాన్ లో 21వ ఎస్‌సీవో సదస్సు

21వ ఎస్‌సీవో సదస్సు తజికిస్తాన్ రాజధాని దుషాంబే లో 2021 సెప్టంబర్ 17న ఘనంగా ప్రారంభం కానుంది. భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ నేరుగా సదస్సులో పాల్గొననున్నారు.

తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రెహ్మన్ అధ్వర్యంలో సదస్సు ప్రారంభం కానుంది. ఎస్సీవో సదస్సుకు  ఎనిమిది దేశాల సభ్య దేశాల అగ్ర నేతలు వర్చువల్ పద్దతిలో పాల్గొని, ప్రసంగించనున్నారు. వర్చువల్ విధానంలో సదస్సు జరగడం ఇదే మొదటి సారి. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్‌లో ప్రసంగించనున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఎస్సీవో భారత్ వరుసగా నాలుగో ఏడాది సదస్సుకు హాజరు కానుంది.

2001లో ఎస్‌సీవో అవిర్భావం:

2001లో ఆరు దేశాలు కలిసి షాంఘైలో ఎస్సీవోను స్థాపించారు. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్ అప్పటి అధ్యక్షులు షాంఘైలో ఎస్సీవో ను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం భారత్ షాంఘై సహకార దేశాలతో కలిసి పనిచేస్తోంది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..