నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్ & న్యూరో సైన్సెస్‌లో 275 ఖాళీలు

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్ & న్యూరో సైన్సెస్ (నిమ్‌హాన్స్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టులు: 275
పోస్టుల వారీగా ఖాళీలు: నర్సింగ్‌ ఆఫీసర్‌–266, స్పీచ్‌ థెరపిస్ట్‌ అండ్‌ ఆడియాలజిస్ట్‌–03, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌)–01, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌–01, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌)–01, టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ)–01, అసిస్టెంట్‌ డైటీషియన్‌–01,
కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌–01
అర్హత‌లు:
నర్సింగ్‌ ఆఫీసర్‌: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో రెండేండ్లపాటు అనుభవం ఉండాలి. స్టేట్‌/ ఇండియ‌న్ న‌ర్సింగ్ కౌన్సిల్‌లో లేదా నర్సులు & మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయస్సు: 35ఏండ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.
స్పీచ్‌ థెరపిస్ట్ & ఆడియాలజిస్ట్‌: స్పీచ్‌ పాథాలజీ/ ఆడియాలజీ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌(న్యూరోమస్‌క్యులార్‌): బేసిక్‌/ మెడికల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ
కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, స్టాటిస్టికల్‌ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్‌ ఉండాలి.
జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–సబ్‌ స్పెషాలిటీ బ్లాక్‌: పోస్ట్‌ ఎండీ/ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ఎండీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
టీచర్‌ ఫర్‌ ఎంఆర్‌ చిల్డ్రన్‌(క్లినికల్‌ సైకాలజీ): సైకాలజీ సబ్జెక్టుతో బీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సాధారణ/ వికలాంగుల పాఠశాలలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి.
అసిస్టెంట్‌ డైటీషియన్‌: సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏదైనా మేజర్‌ హాస్పిటల్‌లో రెండేండ్ల పని అనుభవం ఉండాలి.
సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌(హ్యూమన్‌ జెనెటిక్స్‌): లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ సమాన డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
చిరునామా: డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌నెం. 2900, హోసర్‌ రోడ్, బెంగళూరు–560029
చివరి తేదీ: జూన్ 28
వెబ్‌సైట్‌: www.nimhans.ac.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..