సదరన్‌ రైల్వేలో 3378 అప్రెంటీస్‌లు

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్ & వేగన్‌ వర్క్స్‌కు చెందిన చీఫ్‌ వర్క్‌షాప్‌ మేనేజర్‌ కార్యాలయం వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల‌ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
పోస్టు: అప్రెంటిస్
విభాగాలు: ఫ్రెషర్‌ కేటగిరీ, ఐటీఐ, ఎంఎల్‌టీ.
మొత్తం ఖాళీలు: 3378
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ తదితరాలు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్‌/సంస్థ నుంచి పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌/బయాలజీ) ఉత్తీర్ణత
వయస్సు: 15ఏండ్లు నిండి ఉండాలి. 22/24 ఏండ్లకు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్ల వ‌ర‌కు వయోప‌రిమితిలో సడలింపు ఉంటుంది.
పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ & వేగన్‌ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్‌ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్, చెన్నై డివిజన్‌.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా(పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్‌ మార్కుల ప్రాతిపదికన)
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
చివరి తేదీ: జూన్ 30, 2021
వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..