ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 350 ఖాళీలు

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియ‌న్ కోస్ట్ గార్డ్, ఆర్మ్‌డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు-350
పోస్టుల వారీగా వివరాలు
నావిక్(జనరల్ డ్యూటీ)-260 ఖాళీలు
నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్‌)-50 ఖాళీలు
యాంత్రిక్(మెకానిక‌ల్‌)-20 ఖాళీలు
యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్ )-13 ఖాళీలు
అర్హత‌, వ‌య‌స్సు:
నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ): గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మ‌్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌.
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): కౌన్సిల్ ఆఫ్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్/బోర్డు ద్వారా ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌.
యాంత్రిక్‌: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్/మెకానికల్ ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్ (రేడియో & పవర్) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత‌.
వ‌య‌స్సు: 18 నుంచి 20 ఏండ్ల మధ్య ఉండాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టుల‌కు ఏప్రిల్ 1, 2000 నుంచి మార్చి 31, 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. మిగ‌తా పోస్టుల‌కు ఫిబ్రవ‌రి 1, 2000 నుంచి జ‌న‌వ‌రి 31, 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి
గ‌మ‌నిక‌: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లుపాటు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక‌: నాలుగు ద‌శ‌ల్లో (స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3, స్టేజ్4 ) జ‌రుగుతుంది.
మొదటి దశ(స్టేజ్1)లో రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్ 1, సెక్షన్2, సెక్షన్3, సెక్షన్4, సెక్షన్5 సంబంధించిన మొత్తం ఐదు పరీక్షలు నిర్వహిస్తారు.
రెండో దశ (స్టేజ్2) మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్2 ఎంపిక చేస్తారు.
ఆ త‌ర్వాత ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్ టెస్ట్‌, తొలి మెడికల్ టెస్టులు నిర్వహించ‌బ‌డుతాయి.
ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)లో భాగంగా
A. 1.6 కిలోమీటర్ల పరుగును 7 నిమిషాల్లో పూర్తి చేయాలి.
B. 20 స్క్వాట్ అప్స్ (ఉతక్ బైతక్)
C. 10 పుష్-అప్‌ల‌ను ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ రూల్స్ ప్రకారం పూర్తిచేయాలి.
గ‌మ‌నిక‌: పీఎఫ్‌టీ మూడు పరీక్షలు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా నిర్వహించబడతాయి. మూడు పరీక్షల్లో విరామం తీసుకుంటే పీఎఫ్‌టీ విఫలం లేదా ఫెయిల్‌ చేస్తుంది.
మూడోదశ (స్టేజ్3): స్టేజ్1, స్టేజ్2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్3కి ఎంపిక చేస్తారు. స్టేజ్3లో ఒరిజిన‌ల్‌ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైన‌ల్ మెడిక‌ల్ టెస్ట్‌, పోలీస్ వెరిఫికేషన్ మొద‌లూనవి ఉంటాయి.
నాలుగోదశ (స్టేజ్4): వివిధ యూనివర్సిటీలు లేదా సంస్థలు జారీచేసిన ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ ముందు ఉంచాలి. స‌ర్టిఫికెట్లు ఒక‌వేళ ఒరిజిన‌ల్ కాక‌పోతే (ఫేక్ స‌ర్టిఫికెట్లు) వెంట‌నే టర్మినేట్ చేస్తారు.
దరఖాస్తు: ఆన్ లైన్ లో
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.250(ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు)
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 2
చివ‌రితేదీ: జూలై 16
వెబ్‌సైట్‌:https://joinindiancoastguard.cdac.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..