భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 46 పోస్టులు

46 posts in Bharat Dynamics Limited

హైదరాబాద్‌(గచ్చిబౌలి)లోని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది.
విభాగాలు: ఎలక్ట్రికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆప్టిక్స్‌, బిజినెస్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌, న్యూ ప్రాజెక్ట్స్‌, సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌
మొత్తం ఖాళీలు: 46
పోస్టుల‌వారీగా ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌-1, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-3, మెడికల్‌ ఆఫీసర్-2, అసిస్టెంట్ మేనేజర్‌-3
మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ-37 ఖాళీలు (UR-20, OBC-13, SC-2, ST-3, EWS-4)
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్‌), ఎంబీఏ/ పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్‌/ ఎంఎస్‌/ ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల‌కు రూ. 40,000-1,40,000 (ఏడాదికి సుమారుగా రూ.10.52లక్షలు), మిగ‌తా పోస్టుల‌కు జీతం ఏడాదికి రూ.20ల‌క్ష‌ల‌కుపైనే చెల్లిస్తారు.
ఎంపిక: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌), ఇంటర్వ్యూ ద్వారా, మిగ‌తా పోస్టుల‌కు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై
దరఖాస్తు ఫీజు: రూ.500 ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఇ-పే ద్వారా (డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ ద్వారా) చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీహెచ్‌సీ / మాజీ సైనికులు / అంతర్గత ఉద్యోగులకు చెందిన అభ్యర్థులకు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 4
చివరి తేదీ: జూలై 19, 2021.
హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: జూలై 27, 2021
వెబ్‌సైట్‌: http://bdl-india.in

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..