IOCLలో 469 అప్రెంటీస్ ఉద్యోగాలు..

దేశ వ్యాప్తంగా ఉన్న పలు రీజయన్లలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కు చెందిన పైప్ లైన్ డివిజన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం అప్రెంటీస్ ఖాళీల సంఖ్య- 469

*దరఖాస్తుకు చివరి తేది- 2021 అక్టోబర్ 25.

*వివిధ ట్రేడుల్లో అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  మెకానికల్, ఎలక్ట్రికల్, హ్యూమన్‌ రిసోర్స్, డేటాఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ అప్రెంటీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*వయోపరిమితికి సంబంధించి 2021 అక్టోబర్ 01 వరకు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

*విద్యార్హతకు సంబంధించి వివిధ ట్రేడులకు సంబంధించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

*నోటిఫికేషన్  పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు  సంబంధించి https://plapps.indianoil.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.