సౌత్ వెస్టర్న్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ పోస్టులు

నిరుద్యోగులకు శుభవార్త. సౌత్ వెస్టర్న్ రైల్వే(SWR) పలు విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం అప్రెంటీస్ ఖాళీల సంఖ్య-904.

*ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*డివిజన్ల వారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

    1. హుబ్లి డివిజన్‌–237,

    2. క్యారేజ్‌ రిపెయిర్‌ వర్క్‌షాప్‌–217,

    3. బెంగళూరు డివిజన్‌–230,

    4. మైసూరు డివిజన్‌–177,

    5. సెంట్రల్‌ వర్క్‌షాప్, మైసూరు–43.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పట్టా సాధించి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 2021 నవంబర్ 03 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.rrchubli.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..