All India Survey on Higher Education 2019-20

– ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (All India Survey on Higher Education) నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

నివేదికలోని ముఖ్యాంశాలు

  • ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 2015-16 నుంచి 2019-20 వరకు (ఐదేండ్లలో) 11.4శాతం పెరిగింది.
  • ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళల సంఖ్యలో 18.2శాతం వృద్ధి నమోదైంది.

Total Enrolment

  • 2018-19, 2019-20 మధ్యకాలంలో ఉన్నత విద్యలో నమోదైన విద్యార్థుల సంఖ్యలో 3.04శాతం వృద్ధి నమోదైంది.

Gross Enrolment Ratio (GER)

  • స్థూల నమోదు నిష్పత్తి (జీఐఆర్), ఉన్నత విద్యలో చేరే అర్హత గల వయసున్న విద్యార్థులలో చేరిన విద్యార్థుల శాతం 2019-20లో 27.1శాతం

Gender Parity Index (GPI)

  • ఉన్నత విద్యలో 2017-18లో 1.00గా ఉన్న లింగ సమానత్వ నిష్పత్తి (జీపీఐ) 2019-20లో 1.01గా ఉన్నది.

Pupil Teacher Ratio

  • 2019-20లో ఉన్నత విద్యలో విద్యార్థులు ఉపాధ్యాయ నిష్పత్తి 26గా ఉన్నది.
  • దేశంలోని ఉన్నత విద్యపై సర్వేను నిర్వహించడం ఇది పదోసారి. విద్యా మంత్రిత్వశాఖ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నది.

క్రెడిట్: సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..