ఐటీఐ సర్టిఫికేట్ ఉందా.. అయితే ఉద్యోగం మీదే..

కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగానికి సంబంధించిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌).. పలు విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపిక విధానం ఉంటుంది.

ఉద్యోగ ముఖ్య సమాచారం: 

మొత్తం 243 పోస్టులకు గానూ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజయ్యింది.

*విద్యార్హతకు సంబంధించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ పట్టా((ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌) సాధించి ఉండాలి.

*2021 అక్టోబర్ 14 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్‌ తదితరాలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలున్నాయి.

*2021 సెప్టెంబర్‌ 20 నుంచి 25 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగనుంది.

*కార్పొరేట్‌ లెర్నింగ్‌–డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (సీఎల్‌డీసీ), నలందా కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్‌ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్‌–500062 చిరునామకు పంపించాలి.

*పూర్తి నోటిఫికేషన్ కోసం www.ecil.co.in వెబ్ సైట్ ను సందర్శించాలి.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..