టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 1785 ఉద్యోగాలు.. త్వరపడండి..

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్ కతా ప్రధాన కేంద్రంగానున్న సౌత్ ఈస్ట్రన్ రైల్వే.. వివిధ వర్క్ షాపులో పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1785

*వివిధ ట్రేడుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్ జాయింటర్ ట్రేడుల్లో పోస్టులు  ఖాళీగా ఉన్నాయి.

*ఖరగ్ పూర్  వర్క్ షాపు, సిగ్నల్ అండ్ టెలికాం వర్క్ షాప్, ట్రాక్ మెషిన్ తదితర విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ  పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 15 నుంచి 24  ఏళ్ల మధ్య ఉండాలి.

*అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rrcser.co.in వెబ్  సైట్ ను చూడొచ్చు.