ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. టెట్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్-1

1ఏ: రెగ్యులర్ స్కూళ్లలో 1-5 తరగతుల టీచర్ పోస్టులకు పేపర్ 1-ఏలో అర్హత సాధించాలి.
1బీ: దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూల్స్‌లో 1-5 తరగతులు బోధించాలంటే పేపర్ 1-బీలో అర్హత తప్పనిసరి.

పరీక్ష విధానం

పేపర్-1ఏ, 1బీ (ప్రశ్నలు 150, సమయం 2.30గంటలు)

కేటగిరీ ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ 30 30
లాంగ్వేజ్-1 30 30
లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 30
మ్యాథమెటిక్స్ 30 30
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ 30 30

 

పేపర్-2

2ఏ: రెగ్యులర్ స్కూ్ళ్లలో 6-8, ఆపై తరగతులు బోధించాలంటే పేపర్ 2-ఏలో అర్హత సాధించాలి.

పరీక్ష విధానం

పేపర్-2ఏ(ప్రశ్నలు 150, సమయం 2.30గంటలు)

కేటగిరీ ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ 30 30
లాంగ్వేజ్-1 30 30
లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 30
మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజెస్ 60 60

 

2బీ: స్పెషల్ స్కూళ్లలో అవే తరగతులకు పేపర్-2బీలో అర్హత తప్పనిసరి.

పరీక్ష విధానం
పేపర్-2ఏ(ప్రశ్నలు 150, సమయం 2.30గంటలు)

కేటగిరీ ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ 30 30
లాంగ్వేజ్-1 30 30
లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 30
డిజేబిలిటీ స్పెషలైజేషన్, పెడగాగీ 60 60

అర్హత మార్కులు: జనరల్ (60శాతంపైగా), బీసీలు (50శాతంపైగా), ఎస్సీ, ఎస్టీలు (40శాతంపైగా)

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..