సికింద్రాబాద్ లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, ఈ అర్హతలుంటే చాలు

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో, ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోటా ద్వారా రిక్రూట్ మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ సమాచారం:

*ఇందులో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సోల్జర్ టెక్నికల్(ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్ మెన్ వంటి ఉద్యోగాలు ఖాళీగా  ఉన్నాయి.

*2021 నవంబరు 29 నుంచి 2022 జనవరి 30 వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

* బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌ క్రీడల్లో రాణించి ఉండాలి.

*సోల్జర్ టెక్నికల్ ఉద్యోగానికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ లో 40 శాతం మార్కులతో, మొత్తం మీద 50 శాతం అగ్రిగేట్ మార్కులతో టెన్త్ క్లాస్ పాసై ఉండాలి.
*సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో, మొత్తం మీద 45 శాతం అగ్రిగేట్ మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి.
*సోల్జర్ ట్రేడ్స్ మెన్ కు సంబంధించి 33 శాతం మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి.
*సోల్జర్ క్లర్క్/ఎస్ కేటీ ఉద్యోగానికి సంబంధించి ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులతో, మొత్తం మీద 60 శాతం మార్కులతో ఏవైనా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ఇంగ్లీష్ 50 శాతం, మ్యాథ్స్, అకౌంట్స్, బుక్ కీపింగ్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ లో 50 మార్కులు కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి సోల్జర్ జనరల్ అభ్యర్థులు 17 1/2 నుంచి 21 ఏళ్లు, ఇతర రిజర్వేషన్ అభ్యర్థులకు 17 1/2 నుంచి 23 ఏళ్లు ఉండాలి.
*ఆర్మీ ఆర్డినెన్స్‌ కాప్స్‌, సికింద్రాబాద్ లో ఆర్మీ ర్యాలీ నిర్వహిస్తారు.