ఎల్ ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌లో అసోసియేట్‌ ఉద్యోగులు

ముంబయిలోని లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్(హెచ్‌ఎఫ్‌ఎల్‌) ఖాళీగా ఉన్న అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
మొత్తం పోస్టులు: 6
అర్హత: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కనీసం 55శాతం మార్కులతో సోషల్‌ వర్క్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ(రెగ్యుల‌ర్ విధానంలో) ఉత్తీర్ణత‌. సంబంధిత పనిలో ఏడాదిపాటు అనుభవం ఉండాలి.
గ‌మ‌నిక‌: దూరవిద్య, పార్ట్‌టైం, కరస్పాండెన్స్‌ డిగ్రీలు ఉన్నవారు అర్హులు కాదు.
వయస్సు: జ‌న‌వ‌రి1, 2021 నాటికి 23 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌: జాబ్‌లో చేరిన తేదీ నుంచి ఆరు నెలల పరిశీలన వ్యవధి( ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌) ఉంటుంది. గరిష్ఠంగా మ‌రో ఆరు నెలలు పొడిగించ‌వ‌చ్చు.
ప‌నిచేసే ప్రదేశం: ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్, ముంబయి
జీతం: రూ.6లక్షలు – రూ.9 లక్షలు వ‌ర‌కు సీటీసీ ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్ ద్వారా. ఆన్‌లైన్‌ టెస్ట్‌లో అర్హులైన విద్యార్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా రెజ్యూమ్‌ పంపించాల్సి ఉంటుంది.
చివరి తేదీ: జూన్ 7, 2021
వెబ్‌సైట్‌: www.lichousing.com

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..