బంగాళాఖాత తీర దేశాల బహుళార్ధ సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థ

BIMSTEC (Bay of Bengal initiative for Multi sectoral Technical and Economic cooperation)

ప్రధాన కార్యాలయం: ఢాకా
స్థాపించబడిన సంవత్సరం: జూన్ 6 , 1997
ప్రస్తుత సభ్యత్వదేశాలు (7): బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, భూటాన్

  • ఈ ప్రాంతీయ సమూహం మొదటగా బ్యాంకాక్ లో BIST – EC ( బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోపరేషన్)గా ఏర్పడింది.
  • 1997లో మయన్మార్ ఈ సమూహంలో శాశ్వత సభ్యత్వమును పొందిన పిదప దీనికి BIMST-EC పేరు మార్చారు.
  • 2004లో నేపాల్, భూటాన్ రెండు దేశాలు సభ్యత్వమును పొందాయి.
  • BIMSTEC మొదటి సమావేశము 31 జూలై, 2004 లో బ్యాంకాక్ లో జరిగింది. ఈ సమూహమును అప్పటి నుంచి బంగాళాఖాత తీర దేశాల బహుళార్ధ సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థగా పిలుస్తున్నారు
  • 2005వ సంవత్సరము నుంచి ADB(ఏషియా అభివృద్ధి బ్యాంకు), BIMSTEC దేశాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను పెంపొందించుటకు భాగస్వామిగా మారింది.
  • BIMSTEC అనునది ముఖ్యంగా బంగాళాఖాత పరివేష్టిత దేశాల మధ్య పరస్పర సహకారం, అవగాహన పెంచుకొనుటకు ఉద్దేశించబడింది.
  • సార్క్ మరియు ఏషియన్ కూటముల మధ్య BIMSTEC కూటమి వారధిలా సహకరిస్తుంది.

ప్రారంభ సభ్యదేశాలు: బంగ్లాదేశ్, ఇండియా, (1997 జూన్) శ్రీలంక, థాయిలాండ్ (BIST- EC) 22 డిశంబర్ 1997: మయన్మార్ (BIMSTEC): 2004 నేపాల్, భూటాన్ (BIMSTEC)

– BIMSTEC ప్రధానంగా 14 రంగాలలో పరస్పర సహకారాలను ప్రోత్సహిస్తుంది. ఒక్కొక్క రంగము యొక్క బాధ్యతను ఒక్కొక్క దేశమునకు కేటాయించడం జరిగింది.

1. వ్యాపార మరియు పెట్టుబడి రంగము – బంగ్లాదేశ్
2. రవాణా మరియు కమ్యూనికేషన్ – ఇండియా
3. శక్తి వనరులు – మయన్మార్
4. పర్యాటక రంగం – ఇండియా
5. సాంకేతిక రంగం – శ్రీలంక
6. మత్స్య సంబంధ రంగం -థాయిలాండ్
7. వ్యవసాయం – మయన్మార్
8. ప్రజారోగ్యం – థాయిలాండ్
9. దారిద్ర్య నిర్మూలన – నేపాల్
10. ఉగ్రవాద నిర్మూలన, నేరాలను తగ్గించుట – ఇండియా
11. వాతావరణ మార్పు – బంగ్లాదేశ్
12. ప్రజల మధ్య ఇంటరాక్షన్ – థాయిలాండ్
13. పర్యావరణం మరియు సహజ విపత్తు యాజమాన్యం – ఇండియా
14. సంస్కృతి – భూటాన్ సమావేశాలు ప్రాంతం

సమావేశాలు                     ప్రాంతం
1) 31 – జూలై 2004          బ్యాంకాక్ (థాయిలాండ్)
2) 13 – నవంబర్ 2008      న్యూఢిల్లీ (ఇండియా)
3) 4 – మార్చి 2014           నైపిడా (మయన్మార్)

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..