ఆగస్టు 2 నుంచి సివిల్స్ సర్వీసెస్-2020 ఇంటర్వ్యూలు

సివిల్ సర్వీసెస్- 2020 ఇంటర్వ్యూలను ఆగస్టు 2 నుంచి నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. యూపీఎస్సీ ఇయర్ క్యాలెండర్ ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్‌ సమయానుగుణంగా జరిగాయి. ఏప్రిల్‌లో ఇంటర్వ్యూలు(పర్సనాలిటీ టెస్ట్) జరగాల్సి ఉంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పరిస్థితిని సమీక్షించిన యూపీఎస్సీ ఆగస్టు 2 నుంచి సివిల్ సర్వీసెస్-2020 ఇంటర్వ్యూలను నిర్వహించాలని నిర్ణయించింది. అతి త్వరలో ఇంటర్వ్యూ లెటర్స్‌ను అభ్యర్థులకు పంపనున్నట్లు పేర్కొన్నది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..