కాఫీ క్లబ్ లేదా యునైటింగ్ ఫర్ కాన్‌సెన్సస్ (Uniting for Consensus)

  • 1995లో టర్కీ, పాకిస్తాన్, మెక్సికో, ఈజిప్టులు కలసి ఏర్పాటు చేశాయి.
    సభ్య దేశాలు: 13(అర్జెంటీనా, కెనడా, కొలంబియా, కొస్టారికా, ఇండోనేషియా, ఇటలీ, మల్టా, మెక్సికో, పాకిస్తాన్, దక్షిణకొరియా, సాన్ మారినో, స్పెయిన్, టర్కీ)
    ప్రధాన లక్ష్యం: గ్రూప్ ఆఫ్ 4 దేశాలైన (జి-4) ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల విస్తరణను వ్యతిరేకించడం.
  • భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలను విస్తరించడం వల్ల ఐరాస నిరాయుధీకరణలో జాప్యం జరుగుతుందని, అది ఐరాస పనితీరుపై ప్రభావం చూపుతుందని, అందుకే ప్రస్తుతం ఉన్నట్లుగానే భద్రతా మండలిని ఉంచాలని, విస్తరించరాదని ఈ క్లబ్ డిమాండ్ చేస్తుంది.
  • ఐరాస భద్రతా మండలిని విస్తరించడం వల్ల అప్పటికే ఉన్న పేద, ధనిక దేశాల తారతమ్యాలు మరింత పెరగవచ్చని దేశాలు భావిస్తున్నాయి.
  • ఐరాస శాశ్వత సభ్య దేశాలను విస్తరించడానికి బదులు ప్రస్తుతం ఉన్న వీటో అధికారం లేని తాత్కాలిక సభ్య దేశాలను 10 నుంచి 20 దేశాలకు విస్తరించాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..