Performance Grading Index

  • 2019-20కి సంబంధించిన Performance Grading Indexకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆమోదం తెలిపారు.

ఏమిటి Performance Grading Index

  • రాష్ట్రాలు  కేంద్రపాలిత ప్రాంతాలలో పాఠశాల విద్యారంగంలో పరివర్తన తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సూచికని ప్రవేశపెట్టింది. ఇందులో 70 పారామితులు (parameters) ఉంటాయి. వీటి ఆధారంగా పనితీరుని అంచనా వేస్తారు.
  • ఈ సూచికను మొదటిసారిగా 2019లో ప్రచురించారు. ఇది మూడోసారి.
  • ఈ సూచిక, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాఠశాల విద్యకు సంబంధించి అవసరమైన చొరవ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అన్ని స్థాయిలలో పాఠశాల విద్య పటిష్టంగా ఉండే అవకాశం ఉంటుంది.
  • 2019-20 సంవత్సరానికి అత్యధిక గ్రేడ్ ( A ++ ) ను సాధించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
    పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..