ప్రపంచ పర్యావరణ దినోత్సవం – ప్రధాని ప్రసంగంలోని కీలక అంశాలు

  • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ హితం కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు, సాధించిన ప్రగతి గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించారు.
  • పునరుత్పాదక ఇంధనాల స్థాపిత సామర్థ్యంలో మన దేశం తొలి అయిదు స్థానాల్లో నిలిచింది.
  • గత ఆరేళ్లలో సౌరవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 15 రెట్లు అధికమైంది. దేశంలో అటవీ విస్తీర్ణం 15వేల చదరపు కిలోమీటర్లు మేరకు అదనంగా పెరిగింది.
  • వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా పెట్రోల్ లో 20శాతం ఇథనాల్‌ని మిశ్రమం చేయాలన్న భారత్ లక్ష్యాన్ని అయిదేళ్ల ముందుగానే భారత్ చేరుకోనుందన్నారు. 2030 నాటికి 20శాతం ఇథనాల్‌ని కలిపిన పెట్రోల్‌ని విక్రయించాలనుకున్నారు. కాని 2025 నాటికే భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
  • గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం నెలకొల్పిన కెవాడియాని విద్యుత్ వాహన నగరంగా తీర్చిదిద్దే ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..