The state of Indias environment report-2021

  • ఈ నివేదిక ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ రెండు స్థానాలు కిందకు దిగజారింది.
  • గతేడాది 115 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 117వ స్థానానికి పడిపోయింది.
  • ఆకలి నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం, పర్యావరణ అనుకూల మౌలిక వసతుల నిర్మాణం, నవకల్పనలను ప్రోత్సహించడం వంటి అంశాల్లో పనితీరు కారణంగా భారత్ రెండు స్థానాలు కిందకు పడిపోయిందని నివేదికలో వెల్లడించారు.
  • ఈ నివేదిక ప్రకారం భారత్, దక్షిణాసియా దేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కంటే దిగువన ఉంది.
  • మొత్తం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్కోర్‌లో భారత్ స్కోర్ వందకుగాను 61.9గా నమోదైంది.
  • సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఝార్ఖండ్, బిహార్ సరైన సన్నద్ధతని ప్రదర్శించడం లేదు.
  • పర్యావరణ ప్రదర్శన సూచీలో 180 దేశాలకుగాను భారత్ 168వ స్థానంలో నిలిచింది. అలాగే పర్యావరణ ఆరోగ్య విభాగంలో 172 వ ర్యాంకు దక్కింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు: ఎజెండా 2030లో భాగంగా, ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..