2028 ఒలింపిక్స్ లక్ష్యంగా 143 ఖేలో ఇండియా సెంటర్లు

  • దాదాపు రూ.14.3కోట్లతో అభివద్ధి చేసిన 143 ఖేలో ఇండియా సెంటర్లని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది.
  • ఈ సెంటర్లు 7 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. అవి మహారాష్ట్ర, మిజోరాం, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్. ఒక్కో క్రీడకు ఒక్కో సెంటర్‌ని వినియోగిస్తారు.
  • 2028 ఒలింపిక్స్‌లో భారత్ ని టాప్ 10 దేశాలలో నిలపాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే పిల్లలకు క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నారు.
  • వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 1000 సెంటర్లని ఏర్పాటు చేయాలని, ఇందులో ఒక్కో జిల్లాలో కనీసం ఒక్కో సెంటర్ ఉండేలా చూడాలని క్రీడా మంత్రిత్వశాఖ గతేడాది జూన్ లో నిర్ణయించుకుంది. తాజా ఏర్పాటు చేసిన సెంటర్ల కంటే ముందు 217 సెంటర్లు ఏర్పాటు చేశారు
  • ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్, లడఖ్ లలో జిల్లాకు రెండు చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
  • ఖేలో ఇండియా: దేశంలో క్రీడా స్ఫూర్తిని పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది.

క్రెడిట్: సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..