డీఆర్‌డీఓ డైరక్టర్ కు సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు-2020

2020 సంవత్సరానికి గానూ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లాబొరేటరీ డైరక్టర్ డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషీకి దక్కింది. 

  అవార్డును జోషీకి అందిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ వెల్లడించింది.   సెప్టెంబర్‌ 15న హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును డాక్టర్‌ జోషీకి అందించారు.

డాక్టర్ జోషీ 30 ఏళ్ల నుంచి రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు. వరంగల్ ఎన్ఐటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు. దేశ రక్షణలో కీలకమైన క్షిపణి వ్యవస్థలతో పాటు, వైమానిక వ్యవస్థల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంతకముందు జోషీ నేషనల్‌ టెక్నాలజీ అవార్డుతో పాటు పలు ఇతర అవార్డులు స్వీకరించారు. 

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..