బరోడా జట్టు కోచ్ గా ఆ దేశ ఆటగాడు..

బరోడా జట్టు వచ్చే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్ మోర్ ను హెడ్ కోచ్ గా నియమించుకుంది. 67 ఏళ్ల వాట్ మోర్ 1996 వన్డే ప్రపంచకప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్ గా ఉన్నారు.

                         పలు జాతీయ జట్లకు కోచ్ గా  పనిచేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాల్ జాతీయ జట్లకు, అలాగే భారత్ లో కొన్ని రంజీ జట్లకు కోచ్ గా వ్యవహరించారు. ఐపీఎల్ లో  కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కోచ్ గా పనిచేశారు.