గ్రూప్ ఆఫ్ – 7… 47వ శిఖరాగ్ర సమావేశాలు

గ్రూప్ ఆఫ్ – 7 లేదా జి-7 శిఖరాగ్ర సమావేశాలు జూన్ 11 – 13 నుంచి ప్రారంభం కానున్నాయి.
– ఇవి 47వ శిఖరాగ్ర సమావేశాలు
అతిథ్య దేశం: బ్రిటన్
జి-7 దేశాలు: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా
ప్రత్యేక ఆహ్వానితులు: భారత్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియా, దక్షిణాఫ్రికా
– ఈ సమావేశాలలో జూన్ 12, 13వ తేదీల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొనున్నారు.

గ్రూప్ ఆఫ్ 8 లేదా జి-8

 • 1975వ సంవత్సరంలో ఏర్పాటైంది.
 • పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సమూహం
  1975 : జి-6 – అమెరికా, యూకే, పశ్చిమ జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ
  1976: జి-7 – కెనడా చేరిక
  1997: జి-8 – రష్యా చేరిక

సభ్యదేశాలు: 8 (ప్రస్తుతం 7)

1. అమెరికా 2. కెనడా 3. జర్మనీ 4. ఇటలీ 5. రష్యా 6. బ్రిటన్ 7. ఫ్రాన్స్ 8. జపాన్

 • 2014లో రష్యాను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం ఈ కూటమిని జి-7 కూటమిగా పిలుస్తున్నారు.
 • అభివృద్ధి చెందిన 7 దేశాల మధ్య పరస్పర వాణిజ్య, రక్షణ, ఇంధన సహకరాలను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇవి సమాఖ్యగా ఏర్పడ్డాయి.
సమావేశాలు సంవత్సరం ఆతిథ్య దేశం సమ్మిట్
1వ 1975 ఫ్రాన్స్  జి-6
2వ 1976 అమెరికా  జి-7
23వ 1997    అమెరికా  జి-8
31వ 2005 బ్రిటన్  జి-8 + 5 ఏర్పాటు
45వ 2019 ఫ్రాన్స్  జి-7
46వ 2020  అమెరికా జి-7
47వ 2021    బ్రిటన్   జి-7
 • వాతావరణ మార్పుల లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన చర్యలను వేగవంతంగా చేయాల్సిందిగా జి-7 దేశాల నేతలకు ప్రముఖ కంపెనీల సీఈవోలు విజ్ఞప్తి చేశారు. భిన్న రంగాల మధ్య సహకారంతో ‘నెట్ – జీరో’ ఎకానమీ (వాతావరణంలోకి కొత్తగా వచ్చి చేరే పర్యావరణం నుంచి తొలగించే గ్రీన్ హౌస్ వాయువుల మధ్య సంతులనం)కి రూపాంతంరం చెందే దిశగా చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..