కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం దేశంలో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రంలో ఏదీ?

1. భారత్ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తెలంగాణ రాష్ట్ర సంప్రదింపుల కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. బండి సంజయ్‌కుమార్
బి. ధర్మపురి అరవింద్
సి. నామా నాగేశ్వరరావు
డి. కే కేశవరావు
సమాధానం: డి

2. కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక ప్రకారం దేశంలో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రంలో ఏదీ?
ఎ. పశ్చిమబెంగాల్
బి. మధ్యప్రదేశ్
సి. ఒడిశా
డి. ఆంధ్రప్రదేశ్
సమాధానం: డి

3. 2021-22లో భారతదేశ జీడీపీ ఎంత శాతం ఉంటుందని ఆర్థిక సర్వే 2020-21 అంచనా వేసింది?
ఎ. 7శాతం
బి. 8శాతం
సి. 10శాతం
డి. 11శాతం
సమాధానం: డి

4.డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య అంచనాల నివేదిక -2019 ప్రకారం మరణాలకు కారణమయ్యే టాప్-10 కారణాల్లో కింది ఏ అంటుయేతర వ్యాధులు ఉన్నాయి?
ఎ. అల్జీమర్స్
బి. మధుమేహం
సి. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్
డి. పైవన్నీ
సమాధానం: డి

5. హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడటంతో ఏ రాష్ట్రంలోని రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు కొట్టుకుపోయింది?
ఎ. ఉత్తరాఖండ్
బి. హిమాచల్‌ప్రదేశ్
సి. జమ్ముకశ్మీర్
డి. ఉత్తర్‌ప్రదేశ్
సమాధానం: ఎ

6. 2020వ సంవత్సరంలో హిందీ భాషలో అత్యంత పాపులర్ అయిన పదంగా ఆక్స్‌ఫర్డ్ హిందీ విభాగం వారు ఏ పదాన్ని ఎంపిక చేశారు?
ఎ. దేశ్ భరోసా
బి. ఆత్మనిర్భరత
సి. నిర్భయ్
డి. సంవిధాన్
సమాధానం: బి

7. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను పోలియో రహిత దేశంగా ఏ సంవత్సరంలో ప్రకటించింది?
ఎ. 2014
బి. 2012
సి. 2016
డి. 2010
సమాధానం: ఎ

8. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే భద్రతా హెల్ప్‌లైన్ నంబర్ 182ను రైలు మదద్ నంబర్ అయిన ఎందులో విలీనం చేసినట్లు ఆ శాఖ పేర్కొంది?
ఎ. 1072
బి. 669
సి. 139
డి. 1323
సమాధానం: సి

9. ‘ఫాస్టాగ్ తప్పనిసరి’ విధానం దేశ వ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ. 2020, ఫిబ్రవరి 15
బి. 2020, మార్చి 3
సి. 2020, జనవరి 26
డి. 2020, ఫిబ్రవరి 1
సమాధానం: ఎ

10. రైలు టర్మినళ్ల వద్ద వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురానున్నది?
ఎ. సర్వీస్ మార్కెట్ ఎట్ రైట్ టెర్మినల్స్
బి. ఫ్లాట్‌ఫామ్ పర్చేజింగ్
సి. రైల్ అండ్ బయ్యింగ్ ఫెయిర్
డి. రిటైల్ సర్వీస్ ఇన్‌ ట్రైన్ టెర్మినల్
సమాధానం: ఎ

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..