భారతదేశంలో థోరియం నిల్వలు చాలా అధికంగా ఉన్నాయి. ఇది దేనికి ముఖ్యమైన ఆధారం?

1. ఏ ఆర్థిక కమిషన్ సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రంలోనూ విపత్తు సహాయక కమిటీ ఏర్పాటు చేశారు?
ఎ. ఆరో ఆర్థిక సంఘం
బి. పదో ఆర్థిక సంఘం
సి. పదకొండో ఆర్థిక సంఘం
డి. ఎనిమిదో ఆర్థిక సంఘం
సమాధానం: సి

2. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?
ఎ. సాయంత్రం
బి. ఉదయం
సి. మధ్యాహ్నం
డి. పైవన్నీ
సమాధానం: డి

3. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి?
ఎ. 8.5
బి. 9.0
సి. 8.0
డి. 7.5
సమాధానం: డి

4. కింది వాటిలో భూకంపానికి సంబంధించి సరైనవి?
ఎ. కంపన తరంగాలు ఏర్పడుతాయి
బి. కొద్దికాలం మాత్రమే ఉంటుంది
సి. భూ అంతర్భాగంలో సంభవిస్తుంది
డి. పైవన్నీ
సమాధానం: డి

5. అత్యధికంగా పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తాయి?
ఎ. 58
బి. 50
సి. 80
డి. 68
సమాధానం: డి

6. కింది వాటిలో పశ్చిమబెంగాల్‌లోని రూప్ నారాయణ్‌పూర్‌లో ఏది నెలకొల్పబడింది?
ఎ. భారత్ అల్యూమినియం కర్మాగారం
బి. హిందూస్థాన్ కాపర్ ఫ్లాంట్
సి. భారత్ టెలిఫోన్ కర్మాగారం
డి. హిందూస్థాన్ కేబుల్ కర్మాగారం
సమాధానం: డి

7. ఆపరేషన్ ఫ్లడ్‌కు మరో పేరు?
ఎ. బ్లూ రెవల్యూషన్
బి. వైట్ రెవల్యూషన్
సి. వాటర్ రెవల్యూషన్
డి. పింక్ రెవల్యూషన్
సమాధానం: బి

8. భారతదేశంలో థోరియం నిల్వలు చాలా అధికంగా ఉన్నాయి. ఇది దేనికి ముఖ్యమైన ఆధారం?
ఎ. థర్మల్ విద్యుత్తు
బి. జల విద్యుత్తు
సి. అణు విద్యుత్తు
డి. జల మరియు థర్మల్ విద్యుత్తుల రెండింటికి
సమాధానం: సి

9. ఇండియాలో పడమర దిక్కు వైపు పారే నదులు?
ఎ. గోదావరి
బి. కావేరి
సి. నర్మదా
డి. కృష్ణా
సమాధానం: సి

10. ఏ భూమికి అతి తక్కువ ఎరువులు అవసరమవుతాయి?
ఎ. నల్లరేగడి
బి. లోమీ భూమి
సి. లాటరైట్ భూమి
డి. అల్యూవియల్ భూమి
సమాధానం: ఎ

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..