గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ (Global Gender Gap Report-2020)

 • వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) ప్రతి సంవత్సరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌-2020లో మొత్తం 153 దేశాలకుగాను భారత్ 112వ ర్యాంకులో ఉంది.
 • 2006లో మొట్ట మొదటిసారి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది.
 • లింగ సమానత్వం సాధించడంలో నాలుగు కొలమానాల ఆధారంగా 153 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తారు.
  – ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు
  – విద్యా సంబంధమైన నైపుణ్యం
  – ఆరోగ్యం, మనుగడ
  – రాజకీయ సాధికారత
 • సంపూర్ణ లింగ సమానత్వం సాధించిన దేశాల స్కోర్ 1, అతి తక్కువ సమానత్వం కలిగిన దేశాల స్కోర్ 0‌గా ఉంటుంది.

గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ – 2020

1. ఐస్‌ల్యాండ్ 0.877
2. నార్వే 0.842
3. ఫిన్లాండ్ 0.832
4. స్వీడన్ 0.820
5. నికరాగువా 0.804
6. న్యూజిలాండ్ 0.799
7. ఐర్లాండ్ 0.798
8. స్పెయిన్ 0.795
9. రువాండా 0.791
10. జర్మనీ 0.787
21. యూకే 0.767
50. బంగ్లాదేశ్ 0.726
53. అమెరికా 0.724
81. రష్యా 0.706
92. బ్రెజిల్ 0.691
101. నేపాల్ 0.680
102. శ్రీలంక 0.680
106 చైనా 0.676
112. ఇండియా 0.668
121. జపాన్ 0.652
151. పాకిస్తాన్ 0.564
153. యెమన్ 0.494

 • గత 11 ఏండ్లుగా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో ఐస్‌లాండ్ దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ దేశంలో దాదాపు 88శాతం లింగ సమానత్వం ఉన్నది.
 • అతి తక్కువ లింగ సమానత్వంతో 153వ ర్యాంకులో యెమన్ కొనసాగుతున్నది. ఆ తర్వాత 152- ఇరాక్, 151- పాకిస్థాన్ ఉన్నాయి.
 • గత నివేదికలో 108వ స్థానంలో ఉన్న భారత్ 2020లో 112వ స్థానానికి దిగజారింది. 2006 నివేదికలో 98వ స్థానంలో ఉన్నది. ఇదే అత్యధిక మెరుగైన ర్యాంకు.
 • రాజకీయ సాధికారతలో భారత మెరుగైన వృద్ధితో 18వ ర్యాంకులో ఉండగా, ఆరోగ్యం, మనుగడలో 150, ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలలో 149, విద్యా సంబంధమైన నైపుణ్యంలో 112వ ర్యాంలో ఉండటం గమనార్హం.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..