ఇంటర్ అర్హతతో రైల్వేలో గ్రూప్ సీ ఉద్యోగాలు.. మంచి వేతనం.. అప్లై చేయండి.

నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే జాబ్ చేయడం మీ కల నా అయితే వెంటనే అప్లై చేయండి. కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకి సంబంధించిన ప్రయాగ్ రాజ్ ప్రధాన కేంద్రంగానున్న నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్ సీఆర్) గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21

*స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. క్రికెట్‌,  జిమ్నాస్టిక్స్‌, హాకీ, పవర్‌ లిఫ్టింగ్‌, టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్, బాక్సింగ్‌ తదితర క్రీడల్లో రాణించి ఉండాలి.

*విద్యార్హతకు సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి.

*వరల్డ్ కప్, ఏసియన్ గేమ్స్, చాంఫియన్ ట్రోపీ, ఒలంపిక్స్ స్థాయి ఆటల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

*వయోపరిమతికి సంబంధించి 2022 జనవరి 01 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు  ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rrcpryj.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

.