ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా మరోసారి గుటెర్‌రెస్

UN Secretary – General

  • ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెర్‌రెస్ మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టడానికి, తన అభ్యర్థిత్వాన్ని భద్రతా మండలి ఆమోదించింది.
  • ఈసారి కూడా నియామకమైతే 2022 జనవరి 1 నుంచి మరో ఐదేళ్లపాటు ఐరాస సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో కొనసాగుతారు.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పదవికి నియామకం ఎలా జరుగుతుంది?

  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిఫారసు మేరకు జనరల్ అసెంబ్లీ ద్వారా సెక్రటరీ జనరల్ నియామకం జరుగుతుంది. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలుంటే ఐదు శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి. (చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా). ఈ ఐదు శాశ్వత సభ్యదేశాలకు కీలకమైన పాత్ర ఉంటుంది. సెక్రటరీ జనరల్ అభ్యర్థిత్వంపై ఈ దేశాలకు వీటో జరిపే అధికారం ఉంటుంది.
  • 1997లో ఈజిఫ్ట్‌కు చెందిన బౌట్‌రోస్ ఘాలిని రెండోసారి సెక్రటరీ జనరల్ పదవికి ప్రతిపాదించినప్పుడు యూఎస్ తన వీటో అధికారాన్ని ఉపయోగించింది. అలాగే 1981లో ఆస్ట్రియాకు చెందిన waldheim మూడోసారి ఈ పదవికి ప్రతిపాదించినప్పుడు చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించింది.
  • భద్రతా మండలిలో non – permanent membersగా ఎన్నుకోబడిన మిగతా 10 దేశాలకు(ఇందులో భారత్ కూడా సభ్యదేశం) వీటో అధికారం లేదు. కానీ, సెక్రటరీ జనరల్ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించడంలో వీటి కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఐరాస సెక్రటరీ జనరల్ అభ్యర్థిత్వానికి భద్రతా మండలిలో కనీసం 9 ఓట్లు అవసరం అవుతాయి. అట్లాగే ఈ పదవి కోసం పోటీపడే అభ్యర్థులకు ఐరాస సభ్యదేశం సిఫారసు అవసరం.

క్రెడిట్: సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..