రష్యా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన ప్రపంచ చాంపియన్…

2021 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ లో సెప్టెంబర్ 26న జరిగిన 15 రేసు రష్యా ‘‘రష్యా గ్రాండ్‌ఫ్రి’’లో ప్రపంచ చాంపియన్, మెర్సిడిస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా గెలిపొందాడు. దీంతో హమిల్టన్ 100వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

               రష్యాలోని సోచిలో జరిగిన ఈ రేసులో 53 ల్యాప్ ల ప్రధాన రేసును లూయిస్ హామిల్టన్ గంటా 30 నిముషాల 41.001 సెకన్లలో పూర్తి చేసి చాంపియన్ గా నిలిచాడు.  రెండో స్థానంలో వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)… మూడో స్థానంలో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) ఉన్నారు.