తొలి స్థానంలో ఉన్న స్వర్ణం కోల్పోయాడు..

టోక్యో పారాలింపిక్స్‌–2020లో భాగంగా సెప్టెంబర్‌ 1న నిర్వహించిన షాట్‌పుట్‌ ఎఫ్‌20 క్లాస్‌ పోటీల్లో మలేసియా చెందిన ముహమ్మద్‌ జియాద్‌ జుల్‌కెఫ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.
అయితే పోటీలు జరిగే వేదిక వద్దకు జియాద్‌ ఆలస్యంగా వచ్చాడని, ఇది నిబంధనలకు విరుద్ధమంటూ ఉక్రెయిన్‌ జట్టు ఫిర్యాదు చేసింది. అధికారిక ప్రకటన తర్వాత జియాద్‌ మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా… ఏదో తగిన కారణం ఉంటుందని భావించిన నిర్వాహకులు అతడిని అనుమతించారు. పోటీల అనంతరం విచారణ చేయగా… సరైన కారణం లేకుండానే జియాద్‌ ఆలస్యంగా వచ్చాడని తేలింది. దీంతో వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ కమిటీ… జియాద్‌ విజయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అతని పేరు వద్ద డిడ్‌ నాట్‌ స్టార్ట్‌ (డీఎన్‌ఎస్‌) అని పెట్టేసింది. ఈ ఈవెంట్‌లో స్వర్ణ, రజతాలు ఉక్రెయిన్‌కు దక్కగా, గ్రీస్‌ అథ్లెట్‌ మూడో స్థానంలో నిలిచాడు.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..