ఐసీఏఆర్ యూఎన్ఓ అవార్డు

భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కు ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ప్రతిష్ఠాత్మక వరల్డ్ సాయిల్ డే అవార్డు లభించింది. ప్రజల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పించినందుకుగాను ఈ పురస్కారాన్ని ఐసీఏఆర్ సొంతం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో భూసార పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాన్ని ఐసీఏఆర్ నిర్వహించింది.