IELTSలో High band ఎలా సాధించాలి?

IELTS (International English Language Testing System) పరీక్ష English languageలోని నాలుగు నైపుణ్యాలను పరీక్షిస్తుంది. ముఖ్యంగా భావ వ్యక్తీకరణకు స్పీకింగ్ , రీడింగ్, రైటింగ్, మరియు లిజనింగ్ లో మంచి సామర్థ్యం ఉంటేనే విదేశాల్లో రాణించ గలిగే అవకాశం ఉంటుంది . MS,MBA తదితర గ్రాడ్యూయేట్ కోర్సులతో పాటు BSC,BA,BCOM వంటి అండర్ గ్రాడ్యూయేట్ కోర్సులకు ఈ పరీక్ష తీసుకోవాల్సి ఉంటుంది . దీనితో పాటు GRE, GMAT లేదా SAT వంటి పరీక్షలు రాయాలి.

Structure of IELTS Exam

Listening                4 parts             40 qns       30-40 minutes
Reading                 3 passages       40 qns        60 minutes
Writing                  2 Essays             2 Tasks     60 minutes
Speaking               3 parts                3 parts     15 minutes

ఈ పరీక్ష రెండు పద్ధతుల్లో జరుగుతుంది. పేపర్, కంప్యూటరు ఆధారిత పరీక్ష. రెండింటిలో పెద్ద వ్యత్యాసమేమీ ఉండదు. కేవలం జవాబులు రాసే పద్ధతి మారుతుంది . రెండూ అందుబాటులో ఉన్నంత వరకు మీకు ఏది సౌలభ్యంగా ఉంటుందో ఆ పద్ధతి ఎంచు కోవచ్చు.

ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దాం.

Listening

ఈ సెక్షన్ లో వివిధ దేశాలలో ఇంగ్లిషు ఎలా మాట్లాడుతారో ఆ విధంగా మాట్లాడిన సంభాషణలు, లెక్చర్లు విని అర్థం చేసుకొని వాటిపై అడిగే ప్రశ్నలు ఆన్సర్ చేయాలి. దీనికోసం కొన్ని నమూనా పరీక్షలు బాగా అభ్యసనం చేయాలి. ఎంత ఎక్కువ వింటే అంత అలవాటు అవుతుంది. విదేశీయులు మాట్లాడే భాష అర్థమవ్వలంటే ఆ స్పీడ్, శైలికి అలవాటు పడాలి. అంతా వరకు ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్ చేసినపుడు కొన్ని సూచనలు జాగ్రత్తగా పాటించాలి. ప్రతి ప్రశ్నకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. వాటిని చదివిన తర్వాతే ప్రశ్నలు ఆన్సర్ చేయాలి. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఒక పదం, మరికొన్నింటికి రెండూ లేదా అంతకంటే ఎక్కువ పదాలు వాడాల్సి ఉంటుంది. మొత్తం ielts పరీక్షలో ఈ సెక్షన్ చాలా సులువైనది. ఈ సెక్షన్లో 8 /9 బాండ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే overall band తక్కువ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ సెక్షన్ లో 4 భాగాలుంటాయి. ప్రతి భాగంలో 10 ప్రశ్నలుంటాయి మొదటి రెండు భాగాలు చాలా తేలికగా ఉంటాయి. ఈ రెండు భాగాలలో 20/20 తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మిగిలిన రెండు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. 4వ భాగం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ఇందులో కనీసం 7, 8 ప్రశ్నలు సరిగా చేసినా మొత్తం స్కోర్ 36/40 వస్తే 8 /9 బ్యాండ్ సాధించవచ్చు. ఆడియో కేవలం ఒకేసారి వినే అవకాశం ఉంటుంది. కావున వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఆడియో వినిపించే ముందు కొంత సమయం ప్రశ్నలు చూసుకోవడానికి ఇస్తారు. ఇది చాలా కీలకం. ఈ సమయం చాలా తక్కువగా ఉంటుంది .

ఆడియోలో దేని మీద దృష్టి పెట్టాలి

మన దృష్టి అంతా ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే కేంద్రీకరించాలి. వినేముందు ప్రశ్నలు సరిగా చదివి వాటికి ఏ రకమైన సమాధానం అవసరమో ముందే ఆలోచించి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆడియో వినేటప్పుడు ఆ ఆన్సర్ ఎక్కడ రాబోతుందో పసిగట్టాలి. ఆ పదాన్ని ఖాళీల్లో పూరించాలి. అందుకని ఏమి వినాలి, ఎక్కడ సమాధానం వస్తుంది అనేవి చాలా ముఖ్యం.

ఎలా ప్రాక్టీస్ చేయాలి ?

బిబిసి న్యూస్ , netflixలో సబ్ టైటల్స్‌తో వచ్చే సెరియల్స్ చూస్తే ఉచ్ఛారణపై పూర్తి అవగాహన వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీ ప్రోగ్రెస్ తెలుస్తుంది.

ఆన్సర్స్ పెట్టడంలో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?

– స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండ కూడదు .
– డైరెక్షన్స్ ప్రకారం ఆన్సర్స్ ఉండాలి.
– ఆన్సర్ షీట్ పై సమాధానాలు బదిలీ చేయడానికి అదనంగా 10 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి ఆన్సర్‌ని జాగ్రత్తగా పెట్టాలి.
– ప్రతి ఆన్సర్‌ని సెంటెన్స్‌లో పెట్టి చదవాలి. ఏదైనా తప్పు అనిపిస్తే వెంటనే సరిచూసుకోవాలి. గ్రామర్ ప్రకారం సరిగా ఉంటేనే ఆ ఆన్సర్‌కి మార్క్ ఇస్తారు.

 

 

 

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..