ఇంటర్మీడియట్ అర్హతతో హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

iict hyderabad recruitment 2021

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నది.
మొత్తం ఖాళీలు: 18

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (జనరల్‌): 8 ఖాళీలు
అర్హత: ఇంటర్‌/ సమాన ప‌రీక్ష‌ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 5 ఖాళీలు
అర్హత: అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఇంటర్‌/ సమాన ప‌రీక్ష ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (ఎస్ & పీ): 5 ఖాళీలు
అర్హత: ఇంటర్‌/ సమాన ఉత్తీర్ణత. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయస్సు: 28ఏండ్లు మించరాదు.
జీతభత్యాలు: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, టైప్‌ రైటింగ్‌ టెస్ట్ ద్వారా
పరీక్షా విధానం: కంప్యూటర్ బేస్డ్‌/ ఓఎంఆర్‌ బేస్డ్ విధానంలో పరీక్ష(ఆబ్జెక్టివ్‌ రూపం) నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ఇంటర్‌ సిలబస్‌ స్థాయిలో ప్రశ్నాపత్రం సరళి ఉంటుంది. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో కలిపి మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌ 1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌, ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 200 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. పేపర్‌ 2 జనరల్ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున కేటాయిస్తారు. పరీక్షా సమయం గంట ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌కి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగాలకు నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా
చివరితేదీ: ఆగ‌స్టు 8
హార్డ్‌కాపీల‌కు చివరితేదీ: ఆగ‌స్టు 23
చిరునామా: రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ, ఉప్పల్‌ రోడ్‌, తార్నాక, హైదరాబాద్‌ 500007.
వెబ్‌సైట్‌: www.iict.res.in/career/careerDetail/115