కొవిడ్ అసత్య సమాచారంలో ప్రథమ స్థానంలో భారత్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, వైరస్ గురించి అసత్య సమాచార వ్యాప్తిలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.  దీనికి సంబంధించిన వార్త సేజెస్‌ ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

   ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 138 దేశాల్లో సర్వే చేశారని జర్నల్ పేర్కొంది. ఈ సర్వే లో భారత్ తొలి స్థానంలో నిలిచిందని చెప్పింది. ఇండియాలో ఇంటర్ నెట్ వాడే వారి సంఖ్య అధికంగా ఉండడ, చౌకగా ఇంటర్ నెట్ లభ్యం అవ్వడమే దీనికి కారణమని జర్నల్ అభిప్రాయాన్ని చెప్పింది.

అసత్య సమాచారంలో దేశాలు:

1.భారత్‌ – 18.07శాతం

2.అమెరికా – 9.74 శాతం

3.బ్రెజిల్‌-  8.57 శాతం

4. స్పెయిన్‌ – 8.03 శాతం

ఈ నాలుగు దేశాలు టాప్‌–4లో ఉన్నాయని అధ్యయనం వివరించింది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..