కొవిడ్ వ్యాక్సిన్ గుర్తింపుకు 11 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్

కొవిడ్-19 వ్యాక్సిన్లు, టెస్టులు, పరస్పరం గుర్తించే విషయంలో భారత్ 11 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్ 20న పేర్కొంది.

                లెబనాన్, ఆర్మేనియా, ఉక్రెయిన్, బెల్జియం, హంగెరీ, సెర్బియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, బెలారస్ దేశాలతో భారత్‌ ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొంది. ఈ 11 దేశాల్లోని ప్రజలు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంటే భారత్ పర్యాటక ప్రదేశాలను సందర్శించుకోవచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది. కాకపోతే ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ను సమర్పించాలని తెలిపింది.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..