టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత్ అథ్లెట్

విశ్వ క్రీడల్లో భాగంగా సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల అథ్లెటిక్స్‌ హైజంప్‌ టి64 కేటగిరీ పోటీల్లో 18 ఏళ్ల ప్రవీణ్‌… 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్‌ అన్నాడు. జొనాథన్‌ బ్రూమ్‌ ఎడ్వర్డ్స్‌ (బ్రిటన్‌–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా… లెపియాటో (పోలాండ్‌–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు.

‘షూట్‌ ఆఫ్‌’లో సూపర్‌...
టోక్యో పారాలింపిక్స్‌–2020లో భాగంగా జరిగిన ఆర్చరీ పోటీల్లో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హర్వీందర్‌ సింగ్‌ కాంస్య పతకం గెలిచాడు. 2021, సెప్టెంబర్‌ 3న జరిగిన పురుషుల రికర్వ్‌ ఓపెన్‌ వ్యక్తిగత విభాగం కాంస్య పతక పోరులో… దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ మిన్‌ సుపై హర్వీందర్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో 10–8తో నెగ్గాడు. దీంతో విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా హర్వీందర్‌ చరిత్ర సృష్టించాడు. హరియాణాలోని కైథాల్‌ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హర్వీందర్‌ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..