గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం నుంచి ఎంత మందితో ప్రారంభించారు?

1. జనగణమనకు స్వర కల్పన చేసింది?
ఎ. మార్గరేట్ కజిన్స్
బి. మేడమ్ బీకాజి కామ
సి. అనిబిసెంట్
డి. ఎవరూ కాదు
సమాధానం: ఎ

2. స్వదేశీ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారు?
ఎ. స్త్రీలు
బి. రైతులు
సి. విద్యార్థులు
డి. ముస్లింలు
సమాధానం: బి

3. కింది వారిలో ఖిలాఫత్ కమిటీ సభ్యుడు కాని వారు ఎవరు?
ఎ. హస్రత్ మోహనీ
బి. మౌలానా షౌకత్ అలీ
సి. అబ్దుల్ కలాం ఆజాద్
డి. మహ్మద్ అలీ జిన్నా
సమాధానం: డి

4. జలియన్‌ వాలాబాగ్ దుర్ఘటనకు సంబంధించి సరైనది ఏది?
ఎ. 1919, ఏప్రిల్ 13న జరిగింది
బి. దీనికి కారణం జనరల్ డయ్యార్
సి. ఈ సంఘటనకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదును తిరిగి ఇచ్చాడు
డి. పైవన్నీ
సమాధానం: డి

5. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం నుంచి ఎంత మందితో ప్రారంభించారు?
ఎ. 75
బి. 76
సి. 77
డి. 78
సమాధానం: డి

6. ఎవరి సలహా మేరకు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి?
ఎ. అంబేద్కర్
బి. గాంధీజీ
సి. నెహ్రూ
డి. సైమన్
సమాధానం: డి

7. కింది వాటిలో ఏది తప్పు?
ఎ. 1886, 1893, 1906 ఐఎన్‌సీ అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ
బి. 1938, 1939లో కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్
సి. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు
డి. ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిన భారతీయ మహిళ అనిబిసెంట్
సమాధానం: డి

8. గాంధీజీ దక్షిణాఫ్రికాలో నడిపిన పత్రిక ఏది?
ఎ. ఇండియన్ ఒపినియన్
బి. యంగ్ ఇండియా
సి. నవజీవన్
డి. పైవన్నీ
సమాధానం: ఎ

9. డివైన్ లైఫ్‌ను రచించింది?
ఎ. స్వామి వివేకానంద
బి. అరబిందో ఘోఘ్
సి. దయానంద సరస్వతి
డి. రామకృష్ణ పరమహంస
సమాధానం: ఎ

10. వెనుకబడిన వర్గాల వారికోసం హరిజన అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది ఎవరు?
ఎ. అంబేద్కర్
బి. గాంధీజీ
సి. నెహ్రూ
డి. జ్యోతి బాపూలే
సమాధానం: బి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..