ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభలో మౌలిక రూపంలో ప్రశ్న అడిగితే దానిని ఇలా పిలుస్తారు?

1. దేశంలో అతిపెద్ద వైఫై జోన్‌ను ఏ నగరంలో అభివృద్ధి చేస్తున్నారు?
ఎ. బెంగళూరు
బి. చెన్నై
సి. వడదోర
డి. పాట్నా
సమాధానం: డి

2. ఇస్రో కేంద్రాల్లో పెద్దది?
ఎ. విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం
బి. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
సి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
డి. లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్
సమాధానం: ఎ

3. క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఇంధనం?
ఎ. ద్రవ హైడ్రోజన్
బి. ద్రవ నత్రజని
సి. ద్రవ ఆక్సిజన్
డి. ద్రవ హీలియం
సమాధానం: ఎ

4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉన్నది?
ఎ. హైదరాబాద్
బి. డెహ్రాడూన్
సి. తిరువనంతపురం
డి. బెంగళూరు
సమాధానం: బి

5. ఏ ఇస్రో కేంద్రాన్ని యూఆర్ రావు పేరును పెట్టారు?
ఎ. స్పేస్ అప్లికేషన్ సెంటర్
బి. ఇస్రో శాటిలైట్ సెంటర్
సి. ఆంత్రిక్స్ కార్పోరేషన్
డి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
సమాధానం: బి

6. భారత సంచిత నిధి నుంచి చెల్లింపులకు అధికారం కల్పించేది?
ఎ. ద్రవ్య బిల్లు
బి. వినియోగధికార బిల్లు
సి. ఆర్థిక బిల్లు
డి. సంచిత నిధి చట్టం
సమాధానం: బి

7. రాజ్యసభ కావాల్సిన సమావేశ పూరక సంఖ్య?
ఎ. 25
బి. 50
సి. 100
డి. 126
సమాధానం: ఎ

8. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి వీరు అధ్యక్షత వహిస్తారు?
ఎ. భారత రాష్ట్రపతి
బి. లోక్‌సభ స్పీకర్
సి. రాజ్యసభ చైర్మన్
డి. భారత ప్రధాన మంత్రి
సమాధానం: బి

9. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సభలో మౌలిక రూపంలో ప్రశ్న అడిగితే దానిని ఇలా పిలుస్తారు?
ఎ. అనుబంధ ప్రశ్న
బి. స్వల్ప వ్యవధి ప్రశ్న
సి. నక్షత్ర గుర్తుగల ప్రశ్నలు
డి. నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు
సమాధానం: ఎ

10. బడ్జెట్ సందర్భంలో చర్చా రహిత ఓటింగ్ అనే పదాన్ని దీనికి సంబంధించి ఉపయోగిస్తారు?
ఎ. వినియోగాధికార బిల్లు
బి. సంచిత నిధి భారానికి
సి. డిమాండ్ల ఓటింగ్
డి. ఆర్థిక బిల్లు
సమాధానం: సి

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..