సింధు నాగరికత – ఆర్థిక వ్యవస్థ

  • నాగరికత అత్యున్నత స్థాయికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో సాధించిన విస్తృతమైన అభివృద్ధి. సింధు ప్రజలు పలు వ్యవసాయ రీతులు అంటే రుతువులను అనుసరించి వ్యవసాయం (ఖరీఫ్ మరియు రబీ) పలు విధాలైన నీటిపారుదల సౌకర్యాల గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రదర్శించారు. ఒక్క చెరుకు పంట తప్పించి మిగిలిన పంటలన్నింటిని పండించారు.
  • గోధుమ, బార్లీ వీరి ప్రధాన ఆహార పంటలు అయ్యాయి. లోథాల్ మరియు రంగాపూర్ వంటి ప్రదేశాలలో వరి పండించబడింది. ప్రాచీన ప్రపంచ చరిత్రలోనే పత్తిని తొలిసారిగా పండించిన ఘనత వీరికి దక్కింది. అత్యంత నాణ్యమైన పత్తి లభించే ప్రాంతం కనుక గ్రీకులు సింధులోయ ప్రాంతాన్ని సిండన్ అని వ్యవహరించారు.
  • అధిక వ్యవసాయ ఉత్పత్తి మిగులు తనానికి దారితీసి వ్యాపార వాణిజ్యాల అభివృద్ధి్కి కారణమైంది. నాటి సమకాలిన నాగరికతలతో విస్తృతమైన విదేశీ వ్యాపారం సాగింది. సుమేరియా నుంచి వెండి మెసపటోమియా నుంచి బంగారం ఈజిప్ట్ నుంచి వజ్రాలు గ్రీస్ నుంచి సుగంధ పరిమాళాలు మంగోలియా నుంచి సున్నపు రాళ్లు దక్షిణ భారతదేశం నుంచి ముత్యాలు, గవ్వలు దిగుమతి అయ్యాయి. రాజస్తాన్‌లోని ఖేత్రి గనుల నుంచి రాగి ఉత్పత్తి చేయబడింది. నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు ప్రధాన ఎగుమతి అయ్యాయి.
  • విస్తృత వ్యాపారానికి నిదర్శనంగా సింధు నాగరికత ముద్రికలు మెసపటోమియాలో కనుగొనబడ్డాయి. మెసపటోమియన్లు సింధు నాగరికతను మెలూహా అని పిలిచారు.
  • విదేశీ వ్యాపారం వల్ల విస్తృత నౌకా నిర్మాణం జరిగింది. లోథాల్, సుర్కటోడా, సుక్తజంధర్ మరియు బాలకోట్ ప్రముఖ ఎగుమతి, దిగుమతి కేంద్రాలయ్యాయి.
  • విస్తృతమైన వ్యాపార వాణిజ్యాలకు అనుగుణంగా తూనికలు కొలతలు ప్రవేశ పెట్టబడ్డాయి. 16 మరియు దాని రెట్టింపు సంఖ్యలతో కూడి గణాంక పద్ధతి వీరు పాటించారు.
  • అంతర్గత వ్యాపారం వస్తు మార్పిడి విధానం ద్వారా నిర్వహించబడింది.
విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..