డేంజర్ ఒమిక్రాన్ వైరస్ ఫోటో ఎలా ఉందో తెల్సా…

ప్రస్తుతం అందరినీ భయానికి గురి చేస్తోన్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్. దీనికి సంబంధించిన ఫోటోను ఇటలీ రాజధాని రోమ్ లోని బాంబినో గెసో చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యం  విడుదల చేశారు. ఈ డేంజర్ మహమ్మారి వైరస్ చూడడానికి అచ్చం ఒక మ్యాప్ లా కనబడుతోంది.

డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఇందులో ఎక్కువగా మార్పులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలిని వైద్య నిపుణులు చెప్తున్నారు. అన్ని వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ చాలా డేంజర్ అని పరిశోధకులు వెల్లడించారు. ఒమిక్రాన్ వైరస్ ముందుగా దక్షిణాఫ్రికాలో బయటపడంది. ఇది ఒకరి నుంచి మరోకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తలు పాటించాలని పరిశోధకులు చెప్తున్నారు.