APPSCలో తెలుగు రిపోర్టర్ ఉద్యోగాలు, భారీగా వేతనం..

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను పూర్తి చేసేందుకు సన్నద్దమవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)  రాష్ట్ర శాసనసభలో తెలుగు రిపోర్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య- 05.

*దరఖాస్తుకు చివరి తేది-2021 నవంబర్ 08.

*విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పాసై ఉండాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ పాస్ అవ్వాలి.

*వయోపరిమితికి సంబంధించి 2021 జూలై 01 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

*ఉద్యోగ ఎంపిక కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://psc.ap.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు.