AIIMS, పట్నాలో ఉద్యోగాలు… దరఖాస్తుకు చివరి తేది ఇదే

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన బీహార్ రాజధాని పట్నాలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగాల సంఖ్య- 158

*దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 18.

*వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ సంబంధించి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ పాసై ఉండాలి. టీచింగ్ అనుభవం కల్గి ఉండాలి.

*వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు వయస్సుల అర్హతలు ఉన్నాయి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.aiimspatna.org/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..