AIIMS, పట్నాలో ఉద్యోగాలు.. విద్యార్హతలు ఇవే…..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన బిహార్ రాజధాని పట్నాలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం  ఉద్యోగ ఖాళీల సంఖ్య: 296

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2021 నవంబరు 30-అక్టోబరు 05)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

*ఇందులో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టోర్‌కీపర్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, లీగల్‌ అసిస్టెంట్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, మెడికో సోషల్‌ వర్కర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, స్టెనోగ్రాఫర్, జూనియర్‌ వార్డెన్ ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లామా, బీఎస్సీ, గ్రాడ్యుయేషన్, ఎంఏ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం కల్గి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18  నుంచి 35   ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ  ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి https://www.aiimspatna.org/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.