అనంతపురం APSHCL లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏపీ స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్(APSHCL), ఔట్ సోర్సింగ్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం పోస్టుల సంఖ్య-06
*దరఖాస్తుకు చివరి తేది: 2021 అక్టోబర్ 31.
*రెండు రకాల పోస్టులను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఐటీ మేనేజర్ కు సంబంధించి ఒక పోస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్లలకు సంబంధించి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఐటీ మేనేజర్ పోస్టుకు బీటెక్/ ఎంసీఏ పాస్ తో పాటు సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.
*డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీ పాస్ తో పాటు పీజీడీసీఏ/ బీఎస్సీ(కంప్యూటర్స్‌)/ బీకాం (కంప్యూటర్స్‌)/ఎంసీఏ/ బీటెక్‌ పాసై ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు.
*వయోపరిమితికి సంబంధించి 2021 సెప్టెంబర్ 30 నాటికి 42 ఏళ్లకు మించకూడదు.
*పరీక్ష తేది 2021 నవంబర్ 10.
*దరఖాస్తును ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఏ కాంపౌండ్‌, అనంతపురం చిరునామాకు పంపాలి.

 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..