ఆంధ్రప్రదేశ్ ఆ జిల్లా బ్యాంక్ లో ఉద్యోగాలు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. అనంతపురం జిల్లాలో అనంతపుర్ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(ADCCB)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ  ఖాళీల సంఖ్య: 86

*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 03

*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్-66, అసిస్టెంట్ మేనేజర్-20 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లిష్ నాలెడ్జ్ తో పాటు స్థానిక భాషలో ప్రొఫెషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 45 ఏళ్ల వయస్సు మించకూడదు.

*అసిస్టెంట్ మేనేజర్  ఉద్యోగానికి సంబంధించి 60 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 30  ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://anantapurdccb.com వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.