ఐటీఐ పాస్ అయ్యారా.. అయితే ఈ ఉద్యోగం మీదే..

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) 2021-22 ఏడాదికి సంబంధించి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య- 30

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది:2021 నవంబర్ 02.

*వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్‌ డీజిల్, టర్నర్‌/మెషినిస్ట్‌ విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఐటీఐలో సాధించిన మార్కులను చూస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి http://www.ucil.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

విద్యా ఉద్యోగ స‌మాచారం కోసం దిశ కెరీర్ అప్‌డేట్స్ వాట్సాప్ ద్వారా పొందాల‌నుకుంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "Education" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..