ఏపీ వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగాలు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు…

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APVVP), గుంటూరు జిల్లా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 42

*దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 29

*ఇందులో పలు రకాల ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి. రేడియోగ్రాఫర్‌–01, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2–14, థియేటర్‌ అసిస్టెంట్‌–02, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2–12, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌–01, ఆడియోమెట్రీషియన్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈఓ–06, ఆఫీస్‌ సబార్డినేట్స్‌–04, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్స్‌–01 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డీఎంఎల్ టీ, డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

*2021 జూలై 01 నాటికి 42 ఏళ్ల వయస్సు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ వచ్చిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

* ఆఫ్ లైన్ దరఖాస్తును DCHS, APVVP, Guntur చిరునామాకు పంపించాలి. 

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://guntur.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.