ఏపీ ఆ జిల్లా వైద్యశాఖలో 98 ఉద్యోగాలు.. త్వరపడండి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO) ఔట్ సోర్సింగ్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 98

*దరఖాస్తుకు చివరి తేది: 2021 డిసెంబర్ 05

*ఇందులో నాలుగు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్,  ఫార్మసిస్ట్, ఎఫ్ఎన్ఓ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ పోస్టులు వేకన్సీ  ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ తో పాటు డిప్లోమా, డీ ఫార్మసీ, బీపార్మసీ పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజస్టర అయి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42  ఏళ్ల మధ్య ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://srikakulam.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును DMHO, Eluru, West Godavari, AP చిరునామాకు పంపాలి.