ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. త్వరపడండి..

నిరుద్యోగులకు శుభవార్త. హర్యానాలోని ఫుడ్ కార్పొరేషన్ ఇండియా(FCI) వాచ్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం పోస్టుల సంఖ్య-380

*ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2021 నవంబర్ 19.

*విద్యార్హతకు సంబంధించి ఐదు/ ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ) నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 23300 నుంచి 64000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://fci.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.